MBNR: అడ్డాకుల మండల కేంద్రంలోని శివాంజనేయ–షిరిడి సాయి దేవాలయం నుంచి అయ్యప్ప స్వాములు శబరిమలకు సైకిల్ యాత్రను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, శివస్వాములు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని యాత్రను సాగనంపారు. అనంతరం భక్తులు, మాలధారులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అయ్యప్ప నామస్మరణ చేస్తూ ఈ యాత్ర ప్రారంభమైంది.