MBNR: విద్యార్థులు ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని మహబూబ్‌నగర్ టూ టౌన్ సీఐ ఐజాజుద్దీన్ సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని ఆయన స్పష్టం చేశారు.