GNTR: తెనాలి గంగానమ్మపేటలోని YCP కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతిని శనివారం నిర్వహించారు. మాజీ MLA అన్నాబత్తుని శివకుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల హక్కుల కోసం, మహిళాభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎనలేనిదన్నారు.