TG: అసెంబ్లీలో MIM MLA అక్బరుద్దీన్ ఒవైసీ అసహనం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకు ఎజెండా రావడం లేదని.. షార్ట్ డిస్కషన్ దేనిపై ఉంటుందో తెలియడం లేదని మండిపడ్డారు. ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కృష్ణా, గోదావరి జలాలు తప్ప వేరే టాపిక్ లేదన్నారు. ఎజెండా ఇవ్వకపోతే సభలో ఎలా ప్రిపేర్ అవుతారని నిలదీశారు. సభా హక్కులను స్పీకర్ కాపాడాలని కోరారు.