GDWL: నిరుపేదలు అనారోగ్యానికి గురై కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం వడ్డేపల్లి మండలం శాంతినగర్ క్యాంపు కార్యాలయంలో 20 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు.