AP: ఒంగోలులో జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. వెలుగొంండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా పనులు ఎలా పూర్తి చేస్తారని ఎమ్మెల్యే నిలదీశారు. జెడ్పీ సమావేశంలో రాజకీయాలు చేయొద్దని మాగుంట సూచించారు. ఈ క్రమంలో సమావేశం మధ్యలోనే ఎంపీ వెళ్లిపోయారు.