NRML: కుబీర్ జడ్పీహెచ్ఎస్లో శనివారం సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా ఆమె చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. బాలికలు సావిత్రిబాయిని స్ఫూర్తిగా తీసుకుని విద్యలో ముందుకు సాగాలని సూచించారు.