E.G: నల్లజర్ల మండలం మార్లమూడి గ్రామంలో నిర్వహించిన భూ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులకు ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. రైతుల భూమికి సంబంధించిన పత్రాలపై వ్యక్తుల బొమ్మలు కాకుండా, కేవలం ప్రభుత్వ అధికార రాజముద్ర మాత్రమే ఉండాలన్నారు.