MBNR: BRS కాళేశ్వరం మీద పెట్టిన శ్రద్ధ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై పెట్టలేదని అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ విమర్శించారు. మూడేళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులో కేవలం 35 శాతం పనులే జరిగాయన్నారు. కుర్చీ వేసుకుని కూర్చుంటా అన్న కేసీఆర్ ఎక్కడికి వెళ్లారో, ఆ కుర్చీ ఎక్కడ పోయిందో అని ఎద్దేవా చేశారు. ఒక మోటార్ ఆన్ చేసి జాతికి అంకితం చేశామని ప్రకటించారు.