KNR: నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 7న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు తెలిపారు. అపోలో ఫార్మసీలో 100 ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ లేదా డీ. ఫార్మసీ, బీ.ఫార్మసీలో ఉత్తీర్ణులై 18-30 ఏళ్ల మధ్య వయస్సు గల వారు అర్హులన్నారు.