AKP: పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో జరిగిన ఫ్లెక్సీ వివాదం కేసులో శనివారం ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ అప్పన్న తెలిపారు. గ్రామంలో ఇటీవల ఫ్లెక్సీ ఏర్పాటుపై గ్రామంలో 2 వర్గాలు మధ్య జరిగిన గొడవ కొట్లాటకు దారితీసింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. గ్రామానికి చెందిన డీ. రమణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.