E.G: టీడీపీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు ఉంటుందని MLA మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. శనివారం నల్లజర్ల (M) ప్రకాశరావుపాలెంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జ్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన 76 మందికి CMRF సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు చేస్తున్న కృషి అమూల్యమని ఆయన కొనియాడారు.