కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో డీజేలు, డ్రోన్ల వినియోగంపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. శబ్ద కాలుష్యం, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైక్ సెట్ల వినియోగానికి అనుమతి తీసుకోవాలన్నారు.