కృష్ణా: సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు స్థానిక చింతగుంటపాలెంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు. అవయవాలు ఉన్నంత వరకు యోగాసనాలు వేయాలని, ప్రాణాలు ఉన్నంత వరకు యోగా చేయాలని కోరారు.