NGKL: అధికారుల సమన్వయంతోనే జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతమయ్యాయని నాగర్ కర్నూల్ కలెక్టర్ బదవత్ సంతోష్ తెలిపారు. మూడు దశల్లో జరిగిన ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో అంకితభావంతో పనిచేసిన ప్రతి అధికారిని, సిబ్బందిని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.