ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో DMLT పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొత్తం 568 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా శనివారం కేవలం 490 మంది మాత్రమే హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలను రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జైసింగ్ పరిశీలించి, ఇన్విజిలేటర్లకు పలు సూచనలు చేశారు. ఈ నెల 9వరకు పరీక్షలు జరగనున్నాయి