కృత్రిమ గర్భధారణ (IVF)లో పిండాల జన్యు పరీక్ష కోసం చేసే ‘నాన్ ఇన్వేసివ్ క్రోమోజోమల్ స్క్రీనింగ్’ అవసరం లేదని ICMR నిపుణులు తేల్చారు. పిండానికి హాని కలగకుండా చేసే ఈ పరీక్ష ఖరీదైనదే కాక, కచ్చితమైన ఫలితాలను ఇవ్వడం లేదని 3 వేల పిండాలపై జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఇది గర్భధారణ అవకాశాలను మెరుగుపరచదని ISAR, IVF సంస్థలు స్పష్టం చేశాయి.