KNR: మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే సమాజంలో గౌరవం, భద్రత ఉంటుందని HZB ఏసీపీ మాధవి అన్నారు. జమ్మికుంటలో సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యతో పాటు ఉపాధి అవకాశాలను వినియోగించుకుని ఆర్థిక స్వేచ్ఛతో ఎదగాలని సూచించారు. కుటుంబం, సమాజంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.