HYD: కూకట్పల్లి భాగ్యనగర్ ఫేజ్-3లో ఆక్రమణకు గురైన రూ. 35 కోట్ల విలువైన రెండు పార్కు స్థలాలను (3 వేల గజాలు) హైడ్రా నిన్న స్వాధీనం చేసుకుంది. స్థానికుల ఫిర్యాదుతో కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఆక్రమణలు తొలగించి, ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేయడంతో కాలనీవాసులు హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు.