KNR: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఇల్లందకుంట ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు MPDO రాజేశ్వరరావు తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల వ్యయ వివరాలను, బ్యాంకు నివేదికలను సమర్పించాలని ఆయన సూచించారు. ఏకగ్రీవమైన అభ్యర్థులు కూడా తప్పనిసరిగా రావాలన్నారు.