విజయాన్ని ఎప్పుడూ తలకు ఎక్కించుకోనని బాలీవుడ్ నటి కరీనా కపూర్ తెలిపింది. ‘సక్సెస్ అనేది నాకో లూజ్ డ్రెస్ లాంటిది. దాన్ని చాలా లైట్‌గా తీసుకుంటా’ అని ఆమె పేర్కొంది. నటన తన డీఎన్ఏలోనే ఉందని, జీవితాంతం నటిస్తూనే ఉంటానని చెప్పింది. సోషల్ మీడియా హడావుడి కంటే, నటనపైనే తన దృష్టి ఉంటుందని.. గెలుపోటములను పట్టించుకోకుండా పనిని ప్రేమించాలని సూచించింది.