ADB: కేస్లాపూర్లో ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న నాగోబా జాతర ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం రాత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాతరకు భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు భద్రతా చర్యలపై ఎస్పీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల పార్కింగ్, రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశామన్నారు.