మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని వార్డుకు చెందిన యువ నాయకులు దేవేందర్ నాయక్ మంగళవారం డీసీసీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. కోఆర్డినేటర్లు ఏర్పుల నాగరాజు, అవేజ్లకు దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొద్ది సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నానన్నారు.