RR: జడ్పీహెచ్ఎస్ ఎంపీ పటేల్ గూడా పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఇవాళ జాతీయస్థాయి మహిళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి చేసిన సేవలు గురించి త్యాగాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకట వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.