ADB: గ్రామ అభివృద్ధి పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారంగా కేసులు నమోదు చేయబడతాయని SI విక్రమ్ తెలియజేశారు. భీంపూర్ మండలంలోని అర్లీ(టీ) గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రూ. 62 వేలను బలవంతంగా వసూలు చేశారని ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ఈ మేరకు సంబంధిత VDC సభ్యులపై కేసు నమోదు చేసి, చట్టప్రకారం దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.