MHBD: చలికాలంలో తరచుగా పొగ మంచు కారణంగా ఉదయం వేళ ప్రయాణించే వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తొర్రూరు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ సూచించారు. వాహనదారులు సాధ్యమైనంతవరకు తెల్లవారుజామున ప్రయాణాలను మానేయడం మంచిదని, కొన్ని సమయాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.