NGKL: నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టిన ఊరుకొండపేట తహసీల్దార్ యూసుఫ్ అలీని సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 120లోని 4 ఎకరాల భూమిపై విచారణ కోరుతూ కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. దళిత, గిరిజనుల భూములను ఆక్రమిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.