AKP: జిల్లాలో మోడల్ స్కూల్స్లో అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో అప్పారావు నాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. చీడికాడ మండలం మంచాల స్కూల్లో పీజీటీ సివిక్స్-1,రావికమతం మండలం మరుపాక స్కూల్లో సివిక్స్, ఎకనామిక్స్ ఒకొక్క పోస్ట్ ఖాళీగా ఉన్నాయన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే పోస్టులకు ఈనెల 6లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.