ATP: ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలోని ఎల్బీఎస్ఎన్ఏఏలో జరిగే మిడ్ కేరీర్ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరుకానున్నారు. ఈనెల 5 నుంచి 30 వరకు ఆయన శిక్షణలో ఉంటారు. కలెక్టర్ గైర్హాజరీతో జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.