NGKL: చారకొండ మండలం ఎర్రవల్లి రిజర్వాయర్ ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మాణం వల్ల ఎర్రవల్లితో పాటు అనుబంధ తండాలకు చెందిన సుమారు 1100 కుటుంబాలు నిరాశ్రయులవుతున్నారని గుర్తుచేశారు. ముంపు ప్రాంత ప్రజలకు వెంటనే పునరావాసం కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.