కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్ల ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ ఆరోపించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయిని కలిసి వినతిపత్రం అందజేశారు. జాబితాలోని లోపాలను వెంటనే సరిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.