MDK: మెదక్ మున్సిపాలిటీ ఓటర్ డ్రాఫ్ట్ పబ్లికేషన్‌లో తప్పులు ఉన్నాయని మండల బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పట్టణ కన్వీనర్ మామిండ్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఒక వార్డ్‌కు సంబంధించిన ఓటర్లు మరో వార్డులో వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో మాజీ మున్సిపల్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.