GDWL: యువత కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ రాణించాలి అని గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి సరిత పేర్కొన్నారు. శనివారం మల్దకల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మల్దకల్ మండల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఆమె ప్రారంభించారు. సరిత మాట్లాడుతూ.. మన గ్రామీణ ప్రాంత క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించాలన్నారు.