E.G: తాళ్లపూడి మండలం మలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ABN న్యూస్ ఛానెల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలను మంత్రి దుర్గేష్ ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ కళలు, మహిళల సృజనాత్మకత, మన పండుగల ఆత్మీయతను ప్రతిబింబించే ఇలాంటి కార్యక్రమాలు మన సంస్కృతిని తరతరాలకు అందించే వారధులుగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు.