SKLM: పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావుని ఆయన స్వగృహంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు మొదల వలస రమేష్ మర్యాదపూర్వకంగా ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సంస్థా గత బలోపేతం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని అధ్యక్షులు కోరారు.