కృష్ణా: గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్స్కు ఆదివారం సీఐ హనీష్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రాబోయే పండుగల సమయంలో ఎలాంటి అల్లర్లు, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడరాదని హెచ్చరించారు. చెడు నడతను విడనాడి, సత్ప్రవర్తనతో సమాజంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి నేర కార్యకలాపాలలో పాల్గొనరాదని ఆయన ఆదేశించారు.