MDK: రామాయంపేట మండలం సుతార్ పల్లి గ్రామ శివారులో కారు బోల్తా పడి ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రాయిలాపూర్ గ్రామానికి చెందిన కిషన్ గౌడ్ అనే వ్యక్తి ధర్మారం నుండి తన స్వగ్రామం రాయిలాపూర్‌కు కారులో వెళ్తుండగా సుతార్‌పల్లి శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కిషన్ గౌడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.