KMR: రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామానికి చెందిన చామకంటి నిహారిక జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై అదరగొట్టింది. పోసానిపేట ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిహారిక క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రం తరపున జాతీయ స్థాయికి ఎంపికైంది. పలువురు గ్రామస్థులు ఆమెను ప్రత్యేకంగా అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిచారు.