AP: వినూత్న సంస్కరణలతో కొత్త పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు రూ.60 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించినట్లు తెలిపారు. పీఎం అజయ్ పథకం ద్వారా ఎస్సీ కాలనీల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. NSFDC రుణాలు తీసుకున్నవారికి రూ.40 కోట్ల వడ్డీ మాఫీ చేసినట్లు చెప్పారు.