AP: తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై చంద్రబాబు, రేవంత్ కుట్రపన్నారు. సీమ ఎత్తిపోతల పథకంపై చేసిన వ్యాఖ్యలను రెండు పత్రికలు దాయడానికి ప్రయత్నించాయి. వైఎస్ జగన్.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే చంద్రబాబు ఆపేయడం దుర్మార్గం’ అని పేర్కొన్నారు.