మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకుపైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్లీన్ హిట్ అందుకోవాలంటే రూ.450-500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు.