RR: చేవెళ్ల మున్సిపల్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మాజీ జడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని రచ్చబండ వెనకాల తన సొంత నిధులు రూ. 22 లక్షలతో మినీ హాల్‌కు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మినీ హాల్ మహిళలు వేద పారాయణం, విజయదశమి సందర్భంలో భజన, దుర్గామాత మాల ధరించిన భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.