ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పసుల సాయి కుమార్ నిర్మల్లో ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఎస్సీ కాలనీకి చెందిన సాయి కుమార్ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కాంట్రాక్టు పద్ధతిలో డ్రైవర్గా పని చేస్తున్నారు. నిర్మల్లోని ఓ లాడ్జిలో రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.