2036 ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు 100 మెడల్స్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఐసీసీ చైర్మన్ జై షా ఆకాంక్షించారు. భారత అథ్లెట్లకు ఆ సామర్థ్యం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని కొనియాడారు. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను దక్కించుకోవడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.