NLG: చిట్యాల మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశంను ఆగ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు ఆదివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్దకాపర్తి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బుంగపట్ల తిమ్మయ్య, మాజీ అధ్యక్షులు బైరబోయిన బిక్షం ముదిరాజ్, సంఘం పెద్దలు నాశబోయిన నరసింహ, స్వామి, మోర సత్తయ్య, నూతి వెంకటేశం పాల్గొన్నారు.