ఐపీఎల్లో బంగ్లాదేశ్ ప్లేయర్లు ఆడకుండా బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ స్పందించాడు. ఐపీఎల్ ఆడకుండా తనపై నిర్ణయం తీసుకుంటే, తాను మాత్రం ఏం చేయగలనని నిస్సహాయత వ్యక్తం చేశాడు. కాగా, గత వేలంలో ఇతడిని KKR రూ. 9.20 కోట్ల భారీ ప్రైస్కు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.