RR: సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు డా. చారకొండ వెంకటేష్ కలిశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతమని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.