కృష్ణా: నిర్దిష్ట ప్రణాళికతో 10వ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధ్యమేనని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో శనివారం ఆయన మాట్లాడారు. కేవలం స్లిప్ టెస్ట్లు మాత్రమే కాకుండా విద్యార్ధి చదువులో వెనుకబడటానికి కారణాలను తెలుసుకోవాలని కలెక్టర్ తెలిపారు.