VZM: జామి మండలంలోని అలమండ 1, 2, లొట్లపల్లి, అన్నం రాజుపేట సచివాలయాలను మండల ప్రత్యేక అధికారి డ్వామా పీడీ శారదా దేవి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. సిబ్బంది హాజర్, రికార్డులను తనిఖీ చేసి PGRS పిటిషన్లను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సర్వేలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో MPDO అప్పలనాయుడు పాల్గొన్నారు.