ADB: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ శనివారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అలాగే పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల పరిష్కారంపై చర్చించినట్లు పేర్కొన్నారు.